గబ్బర్ సింగ్ ఇప్పుడు కల్కి గా వస్తునాడు ......
కృష్ణుడు అంటే తలపై కిరీటం , చేతిలో పిల్లన గ్రోవి , చుట్టూ గోపికలతో , అష్ట బార్యలతో ఉంటాడు అనేదే మనం సినిమా లలో చూసాం అయితే కృష్ణుడు ఇలా కూడా ఉంటాడు అని కొత్త రూపం లో చూపిన దర్శకుడు గోపాల గోపాల చిత్రానికి దర్శకత్వం వహించిన కిషోర్ పార్థసాని (డాలీ) . పవన్ కళ్యాణ్ ఓ కొత్త కోణం లో మన ముందుకు తెచ్చాడు .
మరి ఇప్పుడు పవన్ ని మరో కొత్త కోణం లో కల్కి గా మన ముందుకు తీసుకు రాబోతున్నాడు అన్నది ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. " ప్రశ్న నీవే , బదులు నీవే " అంటూ వెన్ను తట్టి ముందుకు నడిపాడు గోపాల గోపాల చిత్రం లో . మరి ఇప్పుడు భగవంతుడి మరో అవతారం "కల్కి" గా పవన్ ను మన ముందుకు ఆవిస్కరించబోతునాడు.
దాసరి గారు పవన్ హీరో గా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నరన్నది అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రానికి కల్కి అన్న పేరును కరారు చేసినట్లు తాజా వార్త . ఈ టైటిల్‌కు పవన్‌కల్యాణ్ కూడా ఓకే చెప్పారంటున్నారు. స్వీయనిర్మాణ సంస్థ తారకప్రభు ఫిలింస్ పతాకంపై దాసరి నారాయణవు తెరకెక్కించనున్న ఈ చిత్రం అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం గబ్బర్‌సింగ్-2 చిత్రీకరణకు సన్నద్ధమవుతున్నారు పవన్‌కల్యాణ్. తర్వాత ఈ చిత్రం దాసరి గారు నిర్ణయం ఎవరి దర్శకత్వంలో తీయాలో ఏ టైటిల్ కరారు చేయాలో తెలుసుకోవాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాలి మరి ....
No comments:
Post a Comment